ఇలా జరుగుతుందని నాకు ముందే తెలుసు: షోయబ్‌ అక్తర్‌

5 May, 2021 17:39 IST|Sakshi

ఢిల్లీ: కరోనా కారణంగా ఐపీఎల్‌ 2021 రద్దైన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో పాక్‌ మాజీ క్రికెటర్‌ షోయబ్‌ అక్తర్‌ దీనిపై స్పందించారు. ఇలా జరుగుతుందని నాకు ముందే తెలుసు అన్నారు. ఈ మేరకు ఆయన ట్విట్టర్‌లో ఓ వీడియో పోస్ట్‌ చేశారు. ఐపీఎల్‌ క్యాన్సల్‌ అయ్యింది. ఇలా జరుగుతుందని నాకు ముందే తెలుసే. రెండు వారాల క్రితమే నేను ఐపీఎల్‌ రద్దు చేయమని సలహా ఇచ్చాను. ప్రస్తుతం ఇండియాలో కోవిడ్‌ కేసులు పెరుగుతున్నాయి. ఇలాంటి సమయంలో జనాల ప్రాణాలు కాపాడటం కన్నా ఏది ముఖ్యం కాదు’’ అన్నాడు షోయబ్‌

ఐపీఎల్‌ రద్దవ్వడంతో బీసీసీఐ మిగిలన 31 మ్యాచ్‌లు నిర్వహించే అవకాశాల కోసం ఆలోచిస్తుంది. కోవిడ్‌ ఉధృతి తగ్గితే.. సెప్టెంబర్‌లో మిగిలిన మ్యాచ్‌లు నిర్వహించే ఆలోచనలో ఉన్నట్లు సమాచారం. ఐసీసీ, మిగతా బోర్డుల సూచనల మేరకు దీనిపై నిర్ణయం తీసుకోనున్నారు. 

చదవండి: IPL 2021: అక్కడ సక్సెస్‌.. ఇక్కడ ఎందుకిలా?

Read latest Sports News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు