'చిటికెలేస్తాడు బయటకు రావాలంటే వణుకు'

11 Oct, 2020 12:30 IST|Sakshi

సాక్షి, అమరావతి: వైఎస్సార్‌ సీపీ నేత, రాజ్యసభ సభ్యుడు విజయసాయిరెడ్డి టీడీపీ నాయుకుడు నారా లోకేష్‌ బాబుపై విమర్శనాస్త్రాలు సంధించారు. ఈ మేరకు తన ట్విటర్‌ ఖాతాలో.. 'బాబు నుండి అవినీతి, అసమర్ధత, అసత్యం వారసత్వంగా తీసుకున్న చినబాబు, ఇప్పుడు బాబునే మించిపోయాడు. వయో భారంతో సంభవించే సహజ మరణంను కూడా తన రియల్‌ఎస్టేట్ అడ్డా అమరావతి లిస్టులో వేసే దుష్ట ప్రచారానికి దిగాడు. తండ్రిలానే మాలోకం మతి చెడిపోయింది. ఇంకెంతకాలం అవుట్‌డేటెడ్ బుర్ర వాడుతావు మాలోకం?' అంటూ ఫైర్‌ అయ్యారు.  (దొంగ దీక్షలకు 300 కోట్లు ఊదేశాడు)

కాగా మరో ట్వీట్‌లో.. కరోనా కట్టడిలో ప్రభుత్వ పనితీరుకు ప్రపంచవ్యాప్తంగా ప్రశంసలు లభించడం చూసి ధైర్యంగా వచ్చినట్టున్నాడు బాబు గారు. జూమ్‌లో సందేశాలిచ్చేదానికి పొరుగు రాష్ట్రంలో ఉన్నా, కరకట్ట నివాసంలో ఉన్నా ఒకటే. మహమ్మారి గుట్టుమట్లన్ని తెలుసని చిటికెలేస్తాడు కానీ బయటకు రావాలంటే వణికి పోతాడు' అంటూ చంద్రబాబుపై వ్యంగ్యాస్త్రాలు సంధించారు.  (‘ఊసరవెల్లులను సిగ్గుపడేలా చేశారు’)

ఆ పసిపిల్లల మోముల్లో వెల్లివిరిసిన ఆనందం పచ్చ మీడియాకు కనిపించడం లేదు. జగనన్న విద్యాకానుక కింద కిట్లు పొందిన విద్యార్థులు దసరా, దీపావళి ఒకేసారి వచ్చినట్టు సంబరపడుతున్నారు. వెలుగు దివ్వెల్లా మెరిసిపోతున్న వారి సంతోషాన్ని చూపించడానికి భజన మీడియాకు మనసొప్పడం లేదు' అంటూ విజయసాయిరెడ్డి వరుస ట్వీట్లలో పేర్కొన్నారు.

Read latest Politics News and Telugu News
Follow us on FaceBook, Twitter
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు
సినిమా