‘అసలు ప్రగతిని డిసెంబర్ 4న చూపిస్తారు’

21 Nov, 2020 19:55 IST|Sakshi

బీజేపీ జాతీయ ఓబీసీ మోర్చా అధ్యక్షుడు లక్ష్మణ్

సాక్షి, హైదరాబాద్‌: జీహెచ్‌ఎంసీ ఎన్నికల్లో టీఆర్‌ఎస్‌కు ప్రజలు బుద్ధి చెప్పడం ఖాయమని బీజేపీ జాతీయ ఓబీసీ మోర్చా అధ్యక్షుడు లక్ష్మణ్‌ అన్నారు. శనివారం ఆయన మీడియా సమావేశంలో మాట్లాడుతూ టీఆర్‌ఎస్‌ విడుదల చేసిన ప్రగతి నివేదికను ప్రచార నివేదికగా అభివర్ణించారు. ఆ నివేదికలో గతకుల రోడ్లు, డంపింగ్‌ యార్డులు లేవని ఎద్దేవా చేశారు.(చదవండి: జనం లేని సేన.. జనసేన: నిరంజన్‌రెడ్డి)

‘‘ కేసీఆర్‌, కేటీఆర్ పడవలు తిప్పిన బొమ్మలు. బోల్తాపడ్డ కార్లు, ఫుడ్ బోర్డు ప్రయాణం బొమ్మలు లేవు. 2600 బస్తీలు నీట మునిగాయి. హైదరాబాద్‌కే 2600 చెరువులు తీసుకుని వచ్చిన ఖ్యాతి హరీశ్‌రావుది. కల్వకుంట్ల కుటుంబ ప్రగతి తప్పితే ప్రజల ప్రగతి లేదు. అసలు ప్రగతిని డిసెంబర్ 4న ప్రజలు చూపిస్తారు. హైదరాబాద్ ప్రజలు పన్నులు కడితే మీరు గతుకుల రోడ్లు, పడవలు ఇస్తున్నారు. విశ్వనగరాన్ని భ్రష్టు పట్టించారని’’ లక్ష్మణ్‌ దుయ్యబట్టారు. (చదవండి:టీఆర్‌ఎస్‌ భయపడుతుంది: బండి సంజయ్‌)

డ్రగ్ మాఫియాను కట్టడి లేదు. మద్యం అమ్మకాలకు అర్ధరాత్రి వరకు అనుమతులిచ్చారు డ్రగ్ కల్చర్‌తో అనేక మంది అమ్మాయిలు బలవుతున్నారు. ప్రజారవాణాను నిర్వీర్యం చేశారు. కార్మికులు ఆతహత్యలు చేసుకున్నా పట్టడం లేదు. టీఆర్ఎస్ అంటే తెలంగాణ రియల్ ఎస్టేట్ సమితి గా మార్చారు.  నగరంలో యువత ఉపాధి ని నిర్వీర్యం చేశారు. చార్జిషీట్‌లో టీఆర్ఎస్ అవినీతి ని బట్టబయలు చేస్తామని’’ తెలిపారు. రానున్న రోజుల్లో అనేక మంది ప్రముఖులు, ఉద్యమకారులను బీజేపీ గొడుగు కిందకు తెస్తామని  పేర్కొన్నారు. ‘టీఆర్ఎస్‌లో కేకే అధ్యక్షుడు అవుతాడా.. కనీసం వర్కింగ్ ప్రెసిడెంట్ అవుతావా’ అంటూ లక్ష్మణ్‌ ఎద్దేవా చేశారు.

Read latest Politics News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు