టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడిగా అచ్చెన్నాయుడు

20 Oct, 2020 04:04 IST|Sakshi

27 మందితో కేంద్ర కమిటీ 

25 మందితో పొలిట్‌బ్యూరో 

పార్టీ కమిటీలను ప్రకటించిన చంద్రబాబు  

సాక్షి, హైదరాబాద్‌/సాక్షి, అమరావతి: టెక్కలి ఎమ్మెల్యే కింజరాపు అచ్చెన్నాయుడు టీడీపీ ఏపీ అధ్యక్షుడిగా నియమితులయ్యారు. పార్టీ కేంద్ర కమిటీ, ఏపీ, తెలంగాణ రాష్ట్ర కమిటీలను టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు సోమవారం ప్రకటించారు. 27 మందితో కేంద్ర కమిటీ, 25 మందితో పొలిట్‌ బ్యూరోను ప్రకటించారు. పొలిట్‌బ్యూరోలో తొమ్మిది మంది బీసీలతో కలిసి మొత్తం 60 శాతం మంది బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనారిటీలను నియమించినట్లు టీడీపీ రాష్ట్ర కార్యాలయం తెలిపింది. కేంద్ర కమిటీలో 49 శాతం బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనారిటీలకు కేటాయించినట్లు పేర్కొంది. ఎల్‌.రమణను మరోసారి తెలంగాణ టీడీపీ అధ్యక్షుడిగా నియమించారు.  

కేంద్ర కమిటీ: టీడీపీ కేంద్ర కమిటీ ఉపాధ్యక్షులుగా  ప్రతిభా భారతి, గల్లా అరుణకుమారి, డీకే సూర్యప్రభ, కోట్ల సూర్యప్రకాష్‌రెడ్డి, మచ్చా నాగేశ్వరరావు, చిలువేరు కాశీనాథ్‌.. ప్రధాన కార్యదర్శులుగా నారా లోకేశ్, వర్ల రామయ్య, రామ్మోహన్ నాయుడు, నిమ్మల రామానాయుడు, బీద రవిచంద్ర, కొత్తకోట దయాకర్‌రెడ్డి, బక్కని నరసింహులు, కంభంపాటి రామ్మోహనరావు (జాతీయ రాజకీయ వ్యవహారాలు)..  రాజకీయ కార్యదర్శిగా టీడీ జనార్దనరావు, అధికార ప్రతినిధులుగా గునపాటి దీపక్‌రెడ్డి, కొమ్మారెడ్డి పట్టాభిరాం, మహ్మద్‌ నజీర్, ప్రేమ్‌కుమార్‌ జైన్ , టి.జ్యోత్స్న, నన్నూరి నర్సిరెడ్డి, కేంద్ర కార్యాలయ కార్యదర్శిగా అశోక్‌బాబును నియమించారు. క్షమశిక్షణా కమిటీ చైర్మన్‌గా బచ్చుల అర్జునుడు, సభ్యులుగా మునిరత్నం, గుంటుపల్లి నాగేశ్వరరావు, బంటు వెంకటేశ్వరరావును, కోశాధికారిగా శ్రీరాం రాజగోపాల్‌ను నియమించారు.   

పొలిట్‌బ్యూరో ఇదీ: పొలిట్‌బ్యూరో సభ్యులుగా యనమల రామకృష్ణుడు, అశోక్‌ గజపతిరాజు,  అయ్యన్నపాత్రుడు, కేఈ కృష్ణమూర్తి, చినరాజప్ప, సోమిరెడ్డి చంద్రమోహ¯Œ రెడ్డి, కాల్వ శ్రీనివాసులు,  బాలకృష్ణ, వర్ల రామయ్య, కళా వెంకట్రావు, నక్కా ఆనంద్‌బాబు, బుచ్చయ్య చౌదరి, బొండా ఉమా, ఎన్ ఎండీ ఫరూక్, గల్లా జయదేవ్, రెడ్డపగాని శ్రీనివాసరెడ్డి, పితాని, కొల్లు రవీంద్ర, అనిత, సంధ్యారాణి, ఎల్‌.రమణ, రావుల చంద్రశేఖర్‌రెడ్డి, అరవింద్‌కుమార్‌ గౌడ్‌ను నియమించారు. లోకేష్, అచ్చెన్నకు పొలిట్‌ బ్యూరోలోనూ అవకాశమిచ్చారు. 

Read latest Politics News and Telugu News
Follow us on FaceBook, Twitter
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు
సినిమా