చంద్రబాబుకు బీపీ.. ఇక్కడకెందుకు తీసుకొచ్చారయ్యా అంటూ అసహనం!

26 Nov, 2021 15:46 IST|Sakshi

సాక్షి, అమరావతి: వరద ప్రభావిత ప్రాంతాలు, ప్రభుత్వం చేపట్టిన సహాయక చర్యలపై విపక్షాలు, పచ్చ మీడియా ప్రచారం చేస్తోన్న అసత్యాలపై అసెంబ్లీ వేదికగా ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి, మంత్రులు స్పందించారు. ఈ సందర్భంగా మంత్రి బాలినేని శ్రీనివాస్‌ రెడ్డి.. నెల్లూరులో చంద్రబాబుకు ఎదురైన చేదు అనుభవం గురించి అసెంబ్లీలో వెల్లడించారు. 

ఈ సందర్భంగా బాలినేని శ్రీనివాస్‌ మాట్లాడుతూ.. ‘‘చంద్రబాబు నెల్లూరు పర్యటనకు వచ్చారు. సెంటర్‌కు వచ్చిన చంద్రబాబు.. ప్రజలను ఉద్దేశించి.. ‘‘ప్రభుత్వం నుంచి మీకు ఏమైనా అందాయా’’ అని ప్రశ్నించారు. అందుకు జనాలు అందాయి అని తెలిపారు. ఈ సమాధానం విన్న చంద్రబాబు తీవ్ర అసహనానికి గురయ్యారు.. ఇక్కడకెందుకు తీసుకొచ్చారయ్యా అంటూ టీడీపీ నేతలపై అసహనం వ్యక్తం చేశారు’’ అని బాలినేని తెలిపారు.
(చదవండి: నాయకుడు అనేవాడు డ్రామాలు చేయకూడదు: సీఎం జగన్‌)

‘‘ఒక్క నెల్లూరులోనే కాదు.. అన్ని ప్రాంతాల్లో.. పూర్తిగా 100 శాతం బాధితులకు అన్ని సహాయక చర్యలు అందాయి. ప్రభుత్వ చర్యలు చూసి చంద్రబాబుకు బీపీ పెరుగుతుంది. ఏం మాట్లాడుతున్నారో ఆయనకు అర్థం కావడం లేదు. అసెంబ్లీలో తనకు ఏమో జరిగిందని.. ఓదార్చాలని జనాలు కోరుతున్నారు. మరో వైపు కొంతమంది తెలుగు దేశం నాయకులు.. సోమశిల ప్రాజెక్ట్‌ దెబ్బతిన్నది.. ముంపుకు గురవుతారని జనాలు భయందోళనకు గురి చేస్తున్నారు’’ అని బాలినేని విమర్శించారు.
(చదవండి: పొరుగు రాష్ట్రాల్లో కూడా ఆరోగ్యశ్రీ సేవలు: సీఎం జగన్‌)

‘‘వరద సహాయక చర్యలు పారదర్శకంగా సాగుతున్నాయి. వరద బాధితులను కాపాడబోయి.. ప్రాణాలు కోల్పోయిన ఎన్డీఆర్‌ఎఫ్‌ కానిస్టేబుల్‌ కుటుంబానికి ప్రభుత్వం 25 లక్షల రూపాయల పరిహారాన్ని అందించింది’’ అని బాలినేని శ్రీనివాస్‌ రెడ్డి తెలిపారు.

చదవండి: వరద బాధితులను రక్షిస్తూ.. ఆశల దీపం ఆరిపోయింది

మరిన్ని వార్తలు