కాంగ్రెస్‌ చిల్లర రాజకీయాలు చేస్తోంది: నడ్డా

17 Oct, 2020 14:50 IST|Sakshi

సాక్షి, న్యూఢిల్లీ: జ‌మ్మూ కశ్మీర్‌లో ఆర్టిక‌ల్ 370 ని తిరిగి పున‌రుద్ద‌రించాల‌ని కాంగ్రెస్ సీనియ‌ర్ నేత, మాజీ ఆర్థిక మంత్రి చిదంబరం చేసిన వ్యాఖ్య‌ల‌ను బీజేపీ ఖండించింది. బీహార్ ఎన్నిక‌ల‌కు మందు కాంగ్రెస్ పార్టీ డ‌ర్టీ పాలిటిక్స్ ప్లే చేస్తోందంటూ ఆ పార్టీ జాతీయ అధ్య‌క్షుడు జేపీ న‌డ్డా విరుచుపడ్డారు. జ‌మ్మూ కశ్మీర్‌లో ప్ర‌జ‌ల హ‌క్కుల‌ను కాపాడేందుకు త‌మ ప్ర‌భుత్వం క‌ట్టుబ‌డి ఉంద‌ని ట్వీట్ చేశారు. బీహార్ ఎన్నిక‌ల్లో ప్ర‌చారానికి కాంగ్రెస్ పార్టీకి ఎటువంటి ఎజెండా లేక‌పోవ‌డం వ‌ల్ల‌నే ఇలాంటి చిల్ల‌ర రాజ‌కీయాలు చేస్తోంద‌ని విమర్శించారు. (చదవండి: నడ్డా టీంలో పురందేశ్వరి, డీకే అరుణ)

గతేడాది అగష్టు 5వ తేదీన ప్రధానమంత్రి నరేంద్ర మోదీ జమ్మూ కశ్మీర్‌కు ప్రత్యేక హోదా కల్పించే ఆర్టికల్‌ 370ని రద్దు చేసిన విషయం తెలిసిందే. దీంతో మోదీ ఏకపక్ష, రాజ్యాంగ విరుద్దమైన నిర్ణయాలను తిప్పికోట్టాలంటూ చిదంబరం చేసిన ప్రకటనపై నడ్డా స్పందించారు. కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ పాకిస్థాన్‌ను ప్ర‌శంసించ‌డం, ఆ పార్టీ మ‌రో నేత చిదంబరం కాశ్మీర్‌లో అర్టిక‌ల్ 370ని అమలు చేయాల‌ని కోర‌డం సిగ్గుచేట‌న్నారు. అయితే గ‌తేడాది ఆర్టిక‌ల్ 370ని రద్దు చేస్తూ.. ఆ రాష్ట్రాన్ని రెండు కేంద్ర పాలిత ప్రాంతాలుగా విభ‌జించిన విష‌యం తెలిసిందే. (చదవండి: కమలంలో కలకలం: సీఎంపై తిరుగుబాటు)

Read latest National News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు