విజయ్‌ను ఫాలో అవుతున్న కత్రినా కైఫ్‌..రీజన్‌ అదే!

6 May, 2021 16:30 IST|Sakshi

టాలీవుడ్‌ క్రేజీ స్టార్‌ విజయ్‌ దేవరకొండ ఫాలోయింగ్‌ గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు.‘అర్జున్‌ రెడ్డి’ మూవీతో ఒక్కసారిగా ఇండస్ట్రీలో ఎంతో క్రేజ్‌ సంపాదించుకున్న విజయ్‌కు టాలీవుడ్‌ నుంచి బాలీవుడ్‌ వరకు కూడా ఎంతోమంది ఫ్యాన్స్‌ ఉన్నారు. 'లైగర్’ చిత్రంతో విజయ్‌ బాలీవుడ్‌ ఎంట్రీ ఇస్తున్నాడు. ఈ సినిమాలో అనన్య పాండే హీరోయిన్‌గా నటిస్తోంది. పూరీ జగన్నాద్‌, బాలీవుడ్‌ నిర్మాత కరణ్‌ జోహార్‌లు సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ సినిమాను సెప్టెంబర్‌లో రిలీజ్‌ చేస్తామని చిత్ర యూనిట్‌ ప్రకటించింది. ఇక ఈ సినిమా పూర్తవగానే విజయ్ మరో పాన్ ఇండియా ప్రాజెక్టు చేయనున్నట్లు తెలుస్తోంది.

ఈ చిత్రంలో బాలీవుడ్‌ స్టార్‌ హీరోయిన్‌ కత్రినా కైఫ్‌ నటించనున్నట్లు బలంగా వినిపిస్తోంది. అందులో భాగంగానే కత్రినా తన ఇన్‌స్టాగ్రామ్‌ పేజ్‌లో విజయ్‌ని ఫాలో అవుతుందని ప్రచారం సాగుతోంది. ఇటీవలె ఆమె న్యూ డే.. న్యూ హెయిర్ కట్.. న్యూ ఫిలిమ్’అంటూ పెట్టిన ఓ పోస్టు కూడా విజయ్‌ సినిమా గురించే అన్న సందేహామూ ఫ్యాన్స్‌లో కలుగుతోంది. ప్రస్తుతం లైగర్‌ సినిమా షూటింగ్‌ 80 శాతం దాకా పూర్తయ్యింది. ముంబైలో షూటింగ్‌ జరుగుతున్న ఈ సినిమా కరోనా కారణంగా బ్రేక్‌ పడింది. మరోవైపు కత్రినా కూడా  ‘ఫోన్ బూత్’ అనే సినిమాలో నటిస్తుంది. ఇద్దరూ వారి వారి షెడ్యూల్స్‌లో బిజీగా ఉన్న నేపథ్యంలో ఆ సినిమాలు పూర్తవగానే ఈ ప్రాజెక్టు పట్టాలెక్కనుంని సమాచారం. విజయ్‌-కత్రినాల సినిమాను కూడా కరణ్‌జోహార్‌ నిర్మించనున్నట్లు తెలుస్తోంది. అయితే దీనిపై ఇంకా అధికారిక ప్రకటన రావాల్సి ఉంది. 

చదవండి: విజయ్‌ దేవరకొండ బర్త్‌డే స్పెషల్‌ సర్‌ప్రైజ్‌ వచ్చేస్తుంది..

Read latest Movies News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు