థ్రిల్లింగ్‌ జ్వాల

24 Nov, 2020 00:29 IST|Sakshi
విజయ్‌ ఆంటోని

‘బిచ్చగాడు’ చిత్రంతో తెలుగు రాష్ట్రాల్లోనూ అభిమానులను సంపాదించుకున్నారు తమిళ నటుడు విజయ్‌ ఆంటోని. ఆయన హీరోగా రూపొందు తోన్న తాజా చిత్రం ‘జ్వాల’. నవీన్‌.యమ్‌ దర్శకత్వంలో ఈ సినిమా తెలుగులో ‘జ్వాల’గా, తమిళ్‌లో ‘అగ్ని శిరగుగళ్‌’ పేరుతో తెరకెక్కుతోంది. శర్వంత్‌రామ్‌ క్రియేషన్స్‌ పతాకంపై జవ్వాజి రామాంజనేయులు, షిరిడిసాయి క్రియేషన్స్‌ పతాకంపై యమ్‌. రాజశేఖర్‌ రెడ్డి తెలుగులో నిర్మిస్తున్నారు.

ఈ సందర్భంగా యమ్‌. రాజశేఖర్‌ రెడ్డి మాట్లాడుతూ – ‘‘తెలుగు, తమిళ భాషల్లో రూపొందిస్తున్న యాక్షన్‌ థ్రిల్లర్‌ చిత్రమిది. ఉజ్బెకిస్తాన్, కజికిస్తాన్‌ దేశాలతో పాటు యూరప్‌లోని పలు దేశాల్లో చిత్రీకరణ జరిపాం. ఆఖరి షెడ్యూల్‌ కోల్‌కత్తాలో జరుగుతోంది. ఈ షెడ్యూల్‌తో సినిమా చిత్రీకరణ పూర్తవుతుంది. విజయ్‌ ఆంటోని కెరీర్‌లోనే దాదాపు 25కోట్ల బడ్జెట్‌తో తెరకెక్కుతున్న తొలి చిత్రమిది’’ అన్నారు. ఈ చిత్రంలో విజయ్‌ సరసన అక్షరాహాసన్‌ నటిస్తుండగా, ‘సాహో’ ఫేమ్‌ అరుణ్‌ విజయ్, రీమాసేన్‌ కీలక పాత్రలు చేస్తున్నారు. ఈ చిత్రానికి సంగీతం: నటరాజన్‌.

Read latest Movies News and Telugu News
Follow us on FaceBook, Twitter
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు
సినిమా