హనీమూన్‌లో కొత్త జంట

18 Oct, 2020 02:47 IST|Sakshi

పెళ్లయిన రెండు నెలలకు రానా–మిహికా హనీమూన్‌ వెళ్లారు. ఆగస్ట్‌ 8న వీరి వివాహం జరిగిన విషయం తెలిసిందే. కోవిడ్‌ నిబంధనలను పాటిస్తూ, తక్కువమంది సమక్షంలో పెళ్లి వేడుక జరిగింది. కోవిడ్‌ కారణంగానే వెంటనే హనీమూన్‌ ప్లాన్‌ చేసుకోలేకపోయారు ఈ నూతన దంపతులు. ఇప్పుడు లాక్‌డౌన్‌లో కొన్ని సడలింపులు ఏర్పడిన నేపథ్యంలో హనీమూన్‌ చెక్కేసింది ఈ జంట. విదేశాల్లో బీచ్‌ డేని ఎంజాయ్‌ చేస్తూ, సెల్ఫీ దిగారు రానా–మిహికా. ఆ ఫొటోను షేర్‌ చేశారు. ఈ హాలీడే ట్రిప్‌ తర్వాత వచ్చే నెలలో ‘విరాటపర్వం’ షూటింగ్‌లో పాల్గొంటారు రానా.

Read latest Movies News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు