‘శిల్పాశెట్టి చిచ్చుపెట్టలేదు’

12 Jun, 2021 14:56 IST|Sakshi

శిల్పా శెట్టి భర్త రాజ్‌ కుంద్రా తన మొదటి భార్య కవితా గురించి తాజాగా నోరువిప్పాడు. ఓ ఎంటర్‌టైన్‌మెంట్‌ పోర్టల్‌కు శుక్రవారం ఇచ్చిన ఇంటర్వ్యూలో కవితతో విడిపోవడానికి గల కారణాలను వెల్లడించారు. గత పన్నెండేళ్లుగా మౌనంగా ఉన్న రాజ్‌ కుంద్రా మొదటి సారి ఈ విషయంపై స్పందించాడు. కవితాతో విడాకుల విషయంలో ఏర్పడిన తప్పుడు అభిప్రాయాన్ని తుడిచిపెట్టాలని నిర్ణయించుకున్నట్లు వెల్లడించాడు. వ్యాపారవేత్త కుమార్తె అయిన కవితను 2003 లో రాజ్ కుంద్రా వివాహం చేసుకున్నాడు. కానీ ఈ జంట 2006 లో విడాకులు తీసుకున్నారు. వీరికి ఓ కుమార్తె డీలేనా ఉంది. 

అనంతరం రాజ్‌ కుంద్రాశిల్పాశెట్టిని 2019లో వివాహం చేసుకున్నాడు. వీరికి ఇద్దరు పిల్లలు. అయితే రాజ్‌తో విడిపోవడానికి హీరోయిన్‌ శిల్పానే కారణమని అప్పట్లో కవిత తీవ్ర ఆరోపణలు చేశారు. రాజ్‌,శిల్పా కలిసి దిగిన ఫోటోలు తను చూశానని, ఆమె వల్లే మేము విడిపోయామని కవితా ఆరోపించారు. శిల్పా కారణంగానే విడాకుల కోసం వేధించడం మొదలు పెట్టాడని విమర్శించారు. ఇటీవల కవితా కుంద్రా ఓ ఇంటర్వ్యూలో శిల్పా శెట్టిపై చేసిన ఆరోపణలు మళ్లీ ఇంటర్నెట్‌లో వైరలవ్వడంతో రాజ్‌ కుంద్రా స్పందించారు. సెన్సేషన్ కోసం కవితా కొన్ని మీడియా సంస్థలకు డబ్బులు చెల్లించి సెలబ్రిటీ అయినా శిల్పా శెట్టిపై నిరాధార వార్తలు ప్రచారం చేయించిందని, ఆమె ఆరోపణలలో ఎటువంటి నిజం లేదు అన్నాడు.

అయితే కవితా తన సోదరి భర్తతో సంబంధం ఏర్పర్చుకుందని మోసం చేసిందని ఆకారణంతోనే ఇ‍ద్దరూ విడిపోయినట్లు రాజ్‌ కుంద్రా తాజాగా ఇచ్చిన ఇంటర్వ్యూలో  క్లారిటీ ఇచ్చాడు. కవిత తనతో, తన కుటుంబంలోని ప్రతి ఒక్కరితో ఎప్పుడూ వాదితూ గొడవ వాతావరణాన్ని సృష్టించేదాని తెలిపారు. ‘నా కుటుంబమే నా ప్రపంచం.. కానీ ఆమె ఎప్పుడూ నా ఫ్యామిలీతో గొడవ పడుతుంది. మేమంతా కలిసే ఉండేవాళ్లం. ఇండియా నుంచి యూకే వెళ్లినప్పుడు నాన్న, అమ్మ, నేను, నా సోదరి. తన భర్త అంతా కలిసే ఎరూ ఇంట్లో ఉండేవాళ్లం. అప్పుడు కవిత నా సోదరి భర్త చాలా సన్నిహితంగా మెలిగేది. ముఖ్యంగా నేను బిజినెస్‌ పరంగా బయటకు వెళ్లినప్పుడు అతనితో ఎక్కువ సమయం గడిపేది. నా కుటుంబంలో చాలా మంది చివరికి  నా డ్రైవర్ కూడా వీరిద్దరి మధ్య ఏదో ఉందని నాకు చెప్పారు. కానీ నేనెప్పుడు ఆ మాటలు నమ్మలేదు. నమ్మను. నా మాజీ భార్య అన్నీ సౌకర్యాలు ఇచ్చాను. తన కుటుంబం నా కుటుంబం అనే తారతమ్యం లేకుండా చూసుకున్నాను. నేను ఇప్పటికీ ఇదే ఫాలో అవుతాను.

కానీ ఓ రోజు అమ్మ నా మాజీ భార్య, సోదరి భర్తను రెడ్‌ హ్యండెడ్‌గా పట్టుకుంది. దీంతో రెండు కుంటుంబాలు చిన్నాభిన్నం అయ్యాయి. అప్పడే ఆమెకు విడాకులిచ్చాను. అని వెల్లడించారు. శిల్పాకు ఈ విషయాల గురించి బయటకు చెప్పడం ఇష్టం లేదు. ఇవన్నీ చెప్పిన తరువాత ఆమె అప్‌సెట్‌ అయ్యింది. కానీ మళ్లీ మళ్లీ ఇవి సోషల్‌ మీడియాలో వైరలవ్వడం నన్ను కలవరపాటుకు గురిచేస్తోంది. నిజయం అందరికి తెలియాలి అందుకే చెప్తున్నా’ అంటూ చెప్పుకొచ్చాడు.

చదవండి: 
హల్‌చల్‌ : అనుపమ సొగసులు.. అనసూయ కవ్వింపులు..

30 రోజుల్లో సినిమా..'ఏక్ మినీ కథ' హీరోతో మెహ్రీన్‌

Read latest Movies News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు