మిషన్‌ మనాలీ

21 Oct, 2020 04:59 IST|Sakshi
నాగార్జున

నాగార్జున నటిస్తున్న తాజా చిత్రం ‘వైల్డ్‌ డాగ్‌’. అహిషోర్‌ సోల్మన్‌ దర్శకత్వంలో ఈ సినిమాను నిరంజన్‌ రెడ్డి, అన్వేష్‌ రెడ్డి నిర్మిస్తున్నారు. దియా మిర్జా, సయామీ ఖేర్‌ హీరోయిన్లుగా నటిస్తున్నారు. ఈ సినిమాలో ఎన్‌ఐఏ ఆఫీసర్‌ విజయ్‌ వర్మ పాత్రలో నాగార్జున నటిస్తున్నారు. ఈ సినిమా చిత్రీకరణ ఇటీవలే మనాలీలో ప్రారంభం అయింది. 20 రోజుల పాటు మనాలీ షెడ్యూల్‌ జరగనుందని సమాచారం.

ఈ షెడ్యూల్‌లో పలు యాక్షన్‌ సన్నివేశాలను  చిత్రీకరించనున్నారు. ఈ షూటింగ్‌లో పాల్గొంటూ ‘బిగ్‌బాస్‌’ చిత్రీకరణ కోసం వారాంతరాల్లో హైదరాబాద్‌ వస్తారట నాగార్జున. ఈ సినిమా చిత్రీకరణ ఈ ఏడాది చివరి లోపల పూర్తికానుంది.  

Read latest Movies News and Telugu News
Follow us on FaceBook, Twitter
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు
సినిమా