Karthika Deepam: కార్తీక్‌, మోనితల పెళ్లిపై సౌందర్యను నిలదీసిన దీప

2 Jul, 2021 16:56 IST|Sakshi

కార్తీకదీపం జూలై 2: కార్తీక్‌, మోనితల పెళ్లి విషయం తెలుసుకున్న దీప తండ్రి మురళీ కృష్ణ సౌందర్య దగ్గరికి వస్తాడు. ఈ విషయంపై సౌందర్యను నిలదీయడంతో ఆమె మౌనంగా ఉండిపోతుంది. చెయ్యని తప్పుకు నా బిడ్డ పదేళ్లు శిక్ష అనుభవించింది.. ఇప్పుడు కూడా ఏం చెయ్యారా మీరు? అని ప్రశ్నిస్తాడు. దీనిపై సౌందర్యతో వాదించి చివరకు ఏడుస్తూ అక్కడి నుంచి వెళ్లిపోతాడు.

ఆయన వెళ్లగానే సౌందర్య ‘ఓ కన్నతండ్రిగా ఆయన అడిగిన ఏ ప్రశ్నలకే నా దాగ్గర సమాధానం లేదు. మరీ ఇవే ప్రశ్నలు దీప అడిగితే, ఈ పెళ్లి విషయం గురించి తనకు తెలిస్తే ఏంటి పరిస్థితి’ అంటూ మనసులోనే మదనపడుతుంది. ఇదిలా ఉండగా పిల్లలతో కలిసి కార్తీక్‌ భోజనం చేస్తుంటే దీప వడ్డిస్తుంది. హిమ మాట్లాడుతూ మధ్యలో డాడీ మనం బయటికి వెళ్లి చాలా రోజులైంది కదా అని అంటుంది. దీంతో వెంటనే శౌర్య కూడా అవునవును.. మనం నలుగురం కలిసి బయటికి వెళ్దాం.. చాలా బాగుంటుందని అంటుంది. అలాగే దీపతో అమ్మా నువ్వు కూడా వస్తావు కదా అని అడగ్గానే ఎందుకు రాను.. తప్పకుండా వస్తాను అంటుంది.

అందరం కలిసి బయటి వెళదామని అనగానే కార్తీక్, పిల్లలు సంతోషిస్తారు. అలాగే తనకు కొన్ని పనులు ఉన్నాయని, ఈ నెల 25 తేదీన మనం నలుగురం కలిసి బయటికి వెళ్దామని, ఆ రోజు డాడీని ఏ పనులు పెట్టుకోవద్దని చెప్పండి అనగా కార్తీక్‌ షాక్‌ అవుతాడు. ఏంటి దీపకు నిజం తెలిసిందా అని కంగారు పడుతాడు కార్తీక్‌. ఇదిలా ఉండగా మోనిత ఉదయం లేవగానే పొట్టపై చెయి పెట్టుకుని గుడ్ మార్నింగ్ బంగారం అంటూ మురిసిపోతుంది. 16 ఏళ్లు ప్రేమించిన వాడిని పెళ్లి చేసుకోవడానికి ఎన్నో ప్రయత్నాలు చేశాను.. కానీ నువ్వు కడుపులో పడిన మూడు నెలలకే ఈ తల్లి పెళ్లి చేస్తున్నావు. నువ్వు గ్రేట్ బేటా అంటూ సంబరపడిపోతుంది మోనిత.

మరోవైపు సౌందర్య దీప ఇంటికి వస్తుంది. మురళీ కృష్ణ దీపకు పెళ్లి విషయం చెప్పేసి ఉంటాడా? అని భయపడుతూనే లోపలికి వెళ్లేసరికి దీప గుమ్మం దగ్గరే ఎదురు పడుతుంది. రండి అత్తయ్యా అంటూ దీప అతి మార్యాదు చేయడం చూసి సౌందర్య అనుమాన పడుతుంది. ఆ తర్వాత దీప మోనిత, కార్తీక్‌ల పెళ్లి విషయం గురించి  తనకు ఎందుకు చెప్పలేదని దీప సౌందర్యను నిలదీస్తుంది. చివరకు తనలాగే తన పిల్లలకు కూడా సవతి తల్లి పెంపకం రాసినట్లున్నాడు ఆ దేవుడు కానీ దీప బతికి ఉండగా.. నా పిల్లలకు ఎలాంటి చీడపట్టనివ్వను అని ఆవేశంగా అంటుంది. 

అంతేగాక ఇన్నాళ్లు తను పడ్డ కష్టాల గురించి మాట్లాడుతుంది. ‘కొన్నేళ్ల పాటు దారుణమైన నిందను మోశాను. అది చెరిగిందో లేదో తెలియదు కానీ మళ్లీ జీవితాంతం అనుభవించడానికి దారుణమైన పరిస్థితి వచ్చింది. నా మానసిక పరిస్థితి నాకు అర్థమవుతుంది. నా భర్త తప్పు చేశాను తప్పు చేశాను అంటే.. దేవుడు లాంటి మనిషి తప్పు చెయ్యడం ఏంటీ అనుకున్నాను.. ఏదో చెబుతారు ఏదో చెబుతారు అనుకుంటే మోనితోచ్చి కడుపు వచ్చింది అని చెప్పింది. లోపల నా గుండె రగిలిపోతుంది, కడుపు మండుతుంది అత్తయ్యా.. నేను సగటు స్త్రీనే కదా’ అంటూ సౌందర్యతో చెబుతూ ఆవేదన వ్యక్తం చేస్తుంది దీప. 

దీంతో సౌందర్య బాధగా దీపా నేనే కాదు.. ఈ విషయం వాడు నీతో చెప్పలేక నలిగిపోతున్నాడే అంటుంది. కానీ దీప మాత్రం అవును, పాపం నిజంగానే నలిగిపోతూనే నిసహాయంగా చూస్తూనే.. దానితో కలిసి 25 తేదీ రిజిస్టర్ ఆఫీస్‌లో ముహూర్తం నిర్ణయించుకుని వచ్చారు అని వెటకారంగా అంటుంది. ఇంతలో కార్తీక్‌ కంగారుగా బయటకు వెళతాడు. ఎక్కడికి అని అడిగిన అర్జేంట్‌ పనుందని చెప్పి వెళ్లిపోతాడు. ఇక ఆ తర్వాత ఏం జరగునుందో రేపటి ఎపిసోడ్‌లో తెలుసుకుందాం.

Read latest Movies News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు