బిగ్‌బాస్‌ : ఈ వారం ఎలిమినేట్‌ అయ్యేది ఆమే!

20 Nov, 2020 18:31 IST|Sakshi

బిగ్‌బాస్‌ నాల్గో సీజన్‌ ఇప్పటికే 10 వారాలు గడిచిపోయింది. ప్రతీవారం వీకెండ్ వస్తుందంటే చాలు ఎవరు ఉంటారు అనే దానికంటే కూడా ఎవరు వెళ్లిపోతారు అనేనిపైనే అందరి ఫోకస్ ఉంటుంది. కంటెస్టెంట్ల ఫ్యాన్స్‌ కూడా ఇదే విషయంపై ఆందోళన చెందుతారు. ఇప్పుడు కూడా ఇదే జరుగుతుంది. ఈ వారం ఎలిమినేషన్‌కు అభిజిత్, హారిక, అరియానా, లాస్య, సొహైల్, మోనాల్‌లు నామినేట్ అయిన సంగతి తెలిసిందే. వీరిలో ప్రతి ఒక్కరు గేమ్‌ పరంగా తమ ప్రత్యేకతను చాటుకున్నవారే. సేవ్‌ కావడానికి బలంగా పోరాడుతున్నారు కూడా. ఇక ఎలిమినేట్ ఎవరవుతారనే దానిపై లీకులు వస్తున్నాయి. 
(చదవండి : బిగ్‌బాస్‌’ షో చూపిస్తూ బ్రెయిన్‌ ఆపరేషన్‌ ‌)

ప్రస్తుతం వచ్చిన ఓట్ల ప్రకారం చూస్తుంటే ఈ వారం అభిజిత్‌ కచ్చితంగా సేవ్‌ అవుతున్నట్లు తెలుస్తోంది. ఎప్పటి లాగే ఈ వారం కూడా అభిజిత్‌ ప్రేక్షకుల ఓటింగ్‌లో టాప్‌ ప్లేస్‌ దక్కించుకున్నాడట. ఆ తర్వాత సోహైల్‌ రెండో స్థానం దక్కించుకున్నట్లు తెలుస్తోంది. గేమ్‌ పరంగా, ఎంటర్‌టైన్‌మెంట్‌ పరంగా సోహైల్‌ వందశాతం ఫర్మార్మెన్స్‌ ఇస్తున్నాడు. సో ఈ వారం సోహైల్‌ కూడా ఇంట్లో ఉండటం ఖాయంగా కనిపిస్తోంది. ఇక ఇంట్లో ఉన్న అందరి మహిళల కంటే అరియానా చాలా ఎనర్జిటిక్‌గా, జన్యూన్‌ ఫెర్మార్మెన్స్‌తో అందరి ఆకట్టుకొని ఈ వారం భారీగా ఓట్లను సంపాదించుకున్నట్లు తెలుస్తోంది. మరోవైపు అవినాష్‌ ఎలిమినేషన్‌లో లేడు కాబట్టి అతని ఫ్యాన్స్‌ కూడా అరియానాకు ఓట్లు వేసే అవకాశం ఉంది. దీంతో ఈ వారం అరియానా గండం గట్టెక్కినట్లే అనిపిస్తోంది.

ఇక మోనాల్‌ విషయానికి వస్తే.. ఆమెకి బిగ్‌బాస్‌ అండదండలు దండిగా ఉన్నాయి. దీంతో పాటు అఖిల్‌ ఫ్యాన్స్‌ కూడా మోనాల్‌కు ఓట్లు వేస్తున్నట్లు తెలుస్తోంది. దీంతో ఆమె కూడా ఈ వారం ఇంట్లో ఉండే అవకాశాలే ఎక్కువగా ఉన్నాయి.  ఈ విధంగా చూసుకుంటే హారిక, లాస్యలలో ఒకరు ఈ వారం హౌస్ నుంచి ఎలిమినేట్ అవుతారని టాక్. అయితే వీరిద్దరిలో చూసుకుంటే మాత్రం ఎలిమినేషన్‌ అయ్యే అవకాశాలు లాస్యకే ఎక్కువగా ఉన్నాయి. ఫెర్మార్మెన్స్‌ పరంగా లాస్య కంటే హారిక కొంచెం మెరుగ్గా ఉంది. బిగ్‌బాస్‌ ఇచ్చిన టాస్క్‌లను విజయవంతంగా పూర్తి చేస్తూ ఓట్లను సంపాదించుకుంటుంది. లాస్య మాత్రం ఇప్పటి వరకు తనకు ఉన్న ఫ్యాన్‌ ఫాలోయింగ్‌తో సేవ్‌ అవుతూ వచ్చింది. అయితే ఈ వారం మాత్రం ఆమెకే తక్కువ ఓట్లు వచ్చినట్లు ప్రచారం జరుగుతోంది. ఇదే కనుక వాస్తవమైతే.. ఈ ఆదివారంతో సీమ బిడ్డ ‘బిగ్‌బాస్‌’కు గుడ్‌బై చెప్పి ఇంటికి వెళ్లడం ఖాయం.

Read latest Movies News and Telugu News
Follow us on FaceBook, Twitter
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు