శ్రీకాంత్‌కు బాలయ్య స్వీట్‌ వార్నింగ్‌!

12 Jun, 2021 15:56 IST|Sakshi

టాలీవుడ్‌ అగ్ర హీరో నందమూరి బాలకృష్ణ ముక్కుసూటి వ్యక్తిత్వం గురించి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. ఏ విషయాన్నైనా దాచుకొకుండా బయటపెడుతుంటారు. ఈ క్రమంలో ఆయన చేసే వ్యాఖ్యలు సోషల్‌ మీడియాలో వైరల్‌ అవుతుంటాయి. ఇదిలా ఉండగా ఇటీవల ఆయన 61వ వసంతంలోకి అడుగు పెట్టిన సంగతి తెలిసిందే. జూన్‌ 10న ఆయన పుట్టిన రోజు సందర్భంగా ఓ ఛానల్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో బాలయ్య పలు ఆసక్తికర విషయాలను పంచుకున్నారు.

ఈ సందర్భంగా హీరో శ్రీకాంత్‌ గురించి ఆయన ప్రస్తావించారు. ఓ విషయంలో శ్రీకాంత్‌కు ఆయన స్వీట్‌ వార్నింగ్‌ ఇచ్చినట్లు చెప్పారు. కాగా ప్రస్తుతం సినిమాలకు కాస్తా బ్రేక్‌ ఇచ్చిన శ్రీకాంత్‌ ఇప్పుడు విలన్‌గా నటించేందుకు తనని తాను సిద్దం చేసుకుంటున్నాడట. ఇప్పటికే ఆపరేషన్‌ దుర్యోధన సిక్వెల్స్‌లో శ్రీకాంత్‌ విలన్‌గా కనిపించిన సంగతి తెలిసిందే. దీంతో ప్రతికథానాయకుడి పాత్రలపైనే ఇప్పుడు తను పూర్తిగా దృష్టి పెట్టాలనుకుంటు‍న్నాడని ఓ సందర్భంంలో తనతో చెప్పినట్లు బాలకృష్ణ వెల్లడించారు.

అందుకు తగ్గట్టుగా మంచి కథ, పాత్ర కోసం ఎదురు చూస్తున్నానని చెప్పడంతో తాను శ్రీకాంత్‌తో అప్పుడే విలన్‌ పాత్రలు చేయడానికి విల్లేదని, దానికి ఇంకా టైం ఉందని గట్టిగా చెప్పానన్నారు. విలన్‌ రోల్స్‌ పక్కన పెట్టి ఇంకా కొన్నాళ్లు హీరోగా చేయమని స్వీట్‌ వార్నింగ్‌ ఇచ్చానని తెలిపారు. అంతేగాక అవసరమైతే తాను కొన్ని సినిమాలను కూడా సజెస్ట్‌ చేస్తానని శ్రీకాంత్‌కు వివరించినట్లు ఆయన పేర్కొన్నారు. కాగా తన కుమారుడు మోక్షజ్ఞను త్వరలో తన దర్శకత్వంలో స్వయంగా హీరోగా పరిచయం చేయనున్నట్లు బాలకృష్ణ వెల్లడించిన సంగతి తెలిసిందే. 

Read latest Movies News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు