వైరల్‌: ఫుట్‌బాల్‌ ఆట మధ్యలో పారాచూట్‌తో దూకేసిన వ్యక్తి.. ఆపై

12 Jun, 2021 15:36 IST|Sakshi

వార్సా(పోలాండ్‌): ఓ వ్యక్తి పారాచూట్‌తో ఎగరాలని ఆశ పడ్డాడు. ఇంకేముంది ఫ్లైట్‌లో ఆకాశంలోకి వెళ్లి దూకేశాడు. అయితే మధ్యలో పారాచూట్‌లో ఏదో సమస్య తలెత్తడంతో.. నేరుగా ఓ ఫుట్‌బాల్‌ మైదానంలో ల్యాండ్‌ అయ్యాడు. పోలాండ్‌లోని ఈ మైదానంలో ఒలింపియా ఎల్బ్లాగ్ రిజర్వ్, పిసా ప్రిమావెరా బార్క్జెవో ఫుట్‌బాల్‌ జట్లు తలపడుతున్నాయి. కాగా పారాచూటిస్ట్‌ని చూసి ఆటగాళ్లు ఉన్న పళంగా పరుగు లంకించుకున్నారు.

జూన్‌ 6న జరిగిన ఈ వింత ఘటన ప్రస్తుతం సోషల్‌ మీడియాలో తెగ వైరల్‌ అవుతోంది. ఇక పారాచూటిస్ట్‌కు రిఫరీ పసుపు కార్డు చూపించడంతో.. ఈ ఘటన చూసి  నెటిజన్లు భలే సరదాగా ఉందంటూ కామెంట్‌ చేస్తున్నారు. ఇప్పటివరకు ఈ వీడియోను 70 వేలకు పైగా నెటిజన్లు వీక్షించగా.. ఓ నెటిజన్‌ దీనిపై స్పందిస్తూ.. ‘‘రెడ్‌ కార్డు చూపించాల్సింది.’’ అంటూ చమత్కరించాడు.
 

చదవండి: ధరల మంట.. బతుకు తంటా!

Read latest International News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు