భర్తతో విడాకులు, మరో వ్యక్తితో ప్రేమ, ప్రియుడు నిర్లక్ష్యం చేస్తున్నాడని

27 Nov, 2021 10:24 IST|Sakshi
ప్రతీకాత్మక చిత్రం

యువతి ఆత్మహత్య 

సాక్షి, గోల్కొండ: కుటుంబ కలహాలతో పాటు ప్రియుడు నిర్లక్ష్యం చేస్తున్నాడన్న కారణంతో ఓ యువతి ఆత్మహత్య చేసుకుంది. ఈ ఘటన గోల్కొండ పోలీస్‌ స్టేషన్‌ పరిధిలో చోటుచేసుకుంది. పోలీసుల వివరాల ప్రకారం.. సబా(31) తన కుటుంబ సభ్యులతో కలిసి టోలిచౌకి రాహుల్‌ కాలనీ ఫేజ్‌–1లో ఉంటోంది. మొదటి భర్తతో విడాకులు అయ్యాయని స్థానికులు తెలిపారు. కొన్ని రోజులుగా మరో వ్యక్తితో కలిసి ఉంటోంది.

ఇటీవల తాను ప్రేమించిన వ్యక్తి కొద్ది రోజులుగా నిర్లక్ష్యం చేస్తున్నాడని, కొద్ది రోజులుగా ఆమె బాధపడుతోంది. దీనికి తోడు కుటుంబ కలహాలు ఎక్కువయ్యాయి. దీంతో గురువారం రాత్రి ఫ్యాన్‌కు ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకుంది. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.
చదవండి: నెల్లూరు జిల్లాలో దారుణం.. బీటెక్‌ విద్యార్థి దారుణ హత్య?    

మరిన్ని వార్తలు