మహిళతో ఎస్సై వివాహేతర సంబంధం.. రెడ్‌ హ్యండెడ్‌గా పట్టుకొని చితకబాదారు

26 Nov, 2021 13:02 IST|Sakshi

సాక్షి, వనపర్తి: తన భార్యతో వివాహేతర సంబంధం కొనసాగిస్తున్న ఓ ఎస్సైని ఆమె భర్త రెడ్‌ హ్యండెడ్‌గా పట్టుకుని చితకబాదాడు. ఈ ఘటన  జిల్లాలోని కొత్తకోటలో వెలుగు చూసింది. మహిళ భర్త, అతని స్నేహితులు కలిసి ఎస్సైను చితకబాదిన వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్  అవుతుంది. వివరాలు.. కొత్తకోటకు చెందిన ఓ మహిళతో వనపర్తి రూరల్ ఎస్సై షేక్ షఫీ వివాహేతర సంబంధం కొనసాగిస్తున్నాడు. ఈ విషయం సదరు మహిళ భర్తకు తెలియడంతో ఇద్దరిని రెడ్‌ హ్యండెడ్‌గా పట్టుకునేందుకు అవకాశం కోసం వేచి చూశాడు.
చదవండి: వివాహిత అకస్మాత్తుగా మాట్లాడటం మానేయడంతో యువకుడి ఆత్మహత్య 

కాగా ఈ నెల 18న మహిళను కలిసేందుకు ఎస్సై  షేక్‌ షఫీ ఆమె ఇంటికి వచ్చాడు. ఈ క్రమంలో ఇంట్లో భార్యతో ఉన్న ఎస్సైని మహిళ భర్త, అతని మిత్రులు కలిసి చితకబాదారు. ఎస్సై ఎంత ప్రాధేయపడినా ఆగకుండా కొట్టారు. అడ్డువచ్చిన భార్యను కూడా చెంప చెళ్లుమనిపించారు. విషయం తెలుసుకున్న పోలీసులు సంఘటన స్థలానికి చేరుకొని గాయపడిన ఎస్సైని వనపర్తి ఆస్పత్రికి తీసుకువెళ్లారు. అక్కడి నుంచి హైదరాబాద్‌కు తరలించారు. అలాగే సదరు ఎస్సైని పోలీసు ఉన్నతాదికారులు సస్సెండ్ చేశారు. అయితే గౌరవప్రదమైన పోలీస్‌ వృత్తిలో ఉండి ఇలా నీచ బుద్ది చూపించిన ఎస్సై షేక్‌ షఫీపై పులువురు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
చదవండి: చాక్లెట్లు ఇస్తానని చెప్పి 13 ఏళ్ల బాలుడిపై యువకుడి లైంగికదాడి.. 

మరిన్ని వార్తలు