నెల్లూరు జిల్లాలో పెను విషాదం

17 Oct, 2020 21:20 IST|Sakshi

సాక్షి, నెల్లూరు : నెల్లూరులో శనివారం విషాదం చోటుచేసుకుంది. కరెంట్‌ వైర్‌ ఆ ఇంటి యమపాశంగా మారి ముగ్గురు ప్రాణాలు బలితీసుకుంది. వివరాలు.. కల్లూరు పల్లి హౌసింగ్ బోర్డ్ ఎంఐజీలో కాలనీలో ఒక ఇంటి ప్రధాన గేటుపై 11 కె.వి విద్యుత్ వైర్లు తెగిపడ్డాయి. దీన్ని గమనించకుండా గేటు తీసిన ఇంటి యజమాని టీచర్ వేణుగోపాల్ (56) ఒక్కసారిగా విద్యుత్‌ షాక్‌ తగిలి అక్కడికక్కడే మృతి చెందాడు. అయితే భర్తను రక్షిద్దామని ఏం ఆలోచించకుండా వెళ్లిన భార్య మరియమ్మ(52), తల్లి బజ్జమ్మ(70) వేణుగోపాల్‌ చేయి పట్టుకోవడంతో షాక్‌కు గురై అక్కడికక్కడే మరణించారు. ఒకే కుటుంబానికి చెందిన ముగ్గురు మృత్యువాత చెందడంతో కాలనీలో విషాదచాయలు అలుముకున్నాయి. స్థానికులు అందించిన సమాచారంతో పోలీసులు, ఫైర్‌ సిబ్బంది సంఘటనా స్థలానికి చేరుకున్నారు.


 

Read latest Crime News and Telugu News
Follow us on FaceBook, Twitter
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు
సినిమా