ఆరేళ్లుగా వివాహేతర సంబంధం.. ఇద్దరు కాళ్లకు తాడు, నడుముకు చున్ని కట్టుకొని ఆతహత్య

26 Nov, 2021 14:01 IST|Sakshi
సంతోష్‌ (ఫైల్‌)  

పోచారం ప్రాజెక్టులో పడి ఇద్దరి బలవన్మరణం

మృతులిద్దరిది వేర్వేరు కుటుంబాలు

సాక్షి, లింగంపేట(నిజామాబాద్‌): నాగిరెడ్డిపేట మండలంలోని పోచారం ప్రాజెక్టులో పడి ఇద్దరు బలవన్మరణానికి పాల్పడ్డారు. వేర్వేరు కుటుంబాలకు చెందిన ఇరువురు వివాహేతర సంబంధం కారణంగానే ఆత్మహత్యకు పాల్పడ్డారని గ్రామస్తులు పేర్కొంటున్నారు. వివరాలు ఇలా.. లింగంపేట మండలంలోని శెట్పల్లిసంగారెడ్డి గ్రామానికి చెందిన కత్తుల సంతో ష్‌(32)కు కొన్నేళ్ల క్రితం వివాహమైంది. ఇతడికి భార్య స్వప్న, ముగ్గురు పిల్లలు ఉన్నారు. మెదక్‌ జిల్లా చిట్యాల గ్రామానికి చెందిన ధారవోయిన రాణి(26)కి  శెట్పల్లిసంగా రెడ్డి గ్రామానికి చెందిన వెంకట్‌తో కొన్నేళ్ల క్రితం వివాహం జరిగింది. వీరికి ఇద్దరు కుమారులు ఉన్నారు.
చదవండి: మహిళతో ఎస్సై వివాహేతర సంబంధం.. రెడ్‌ హ్యండెడ్‌గా పట్టుకున్న భర్త

కాగా సంతోష్, రాణిల మధ్య ఆరేళ్లుగా వివాహేతర సంబంధం కొనసాగుతున్నట్లు సమాచారం. మూడు రోజుల క్రితం వీరిరువురు ఇంటి నుంచి వెళ్లారు. గురువారం ఉదయం పోచారం ప్రాజెక్టులో శవమై తేలారు. ఇద్దరు కాళ్లకు తాడు, నడుముకు చున్నితో కట్టుకొని ప్రాజెక్టులో పడి బలవన్మరణానికి పాల్పడినట్లు తెలుస్తోంది. వీరి మరణానికి వివాహేతర సంబంధమే కారణమని గ్రామంలో చర్చణీయాంశంగా మారింది.  

మరిన్ని వార్తలు