నెల్లూరు జిల్లాలో దారుణం.. బీటెక్‌ విద్యార్థి దారుణ హత్య?  

27 Nov, 2021 08:29 IST|Sakshi
కంచర్ల రాజేందర్‌ (ఫైల్‌ఫోటో) 

మృతదేహాన్ని తగులబెట్టిన వైనం

అన్ని కోణాల్లోనూ పోలీసుల దర్యాప్తు 

కావలి( నెల్లూరు జిల్లా): కావలి రూరల్‌ పోలీస్‌స్టేషన్‌ సమీపంలో దారుణం చోటుచేసుకుంది. ముసునూరు టోల్‌గేట్‌ సమీపంలో హైవే పక్కనే చెట్ల మధ్య వింజమూరుకు చెందిన బీటెక్‌ విద్యార్థి కంచర్ల రాజేందర్‌ (20)ను గుర్తుతెలియని వ్యక్తులు హత్య చేసి తగులబెట్టిన ఘటన శుక్రవారం వెలుగుచూసింది. కావలి డీఎస్పీ దేవరకొండ ప్రసాద్‌ కథనం మేరకు.. టోల్‌గేట్‌ నుంచి తుమ్మలపెంట వెళ్లే మార్గంలో హైవే పక్కనే చిల్లచెట్లలో గుర్తుతెలియని మృతదేహం ఉన్నట్లు హైవే అథారిటీ సిబ్బంది సమాచారం అందించారు.

చదవండి: వీడిన మిస్టరీ: ‘కోరిక’ తీర్చాలని బలవంతం చేయడంతో..

మృతదేహం వద్ద లభించిన సగం కాలిన సెల్‌ఫోన్‌లోని సిమ్‌కార్డ్‌ ఆధారంగా వివరాలు సేకరించారు. అతను వింజమూరుకు చెందిన కంచర్ల రాజేందర్‌గా తెలిసింది. కావలి విట్స్‌ కళాశాలలో బీటెక్‌ మూడో సంవత్సరం చదువుతున్న రాజేందర్‌ గురువారం ఉదయం కాలేజీకని చెప్పి ఇంటి నుంచి వెళ్లి తిరిగి రాలేదు. దీంతో తల్లిదండ్రులు కళాశాలలో విచారించగా అసలు కాలేజీకే రాలేదని తెలిపారు. ఈ క్రమంలోనే రాజేందర్‌ మృతదేహం ముసునూరు టోల్‌గేట్‌ సమీపంలో లభించింది. ఈ మేరకు అనుమానాస్పద మృతి కింద కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టినట్లు డీఎస్పీ తెలిపారు.
చదవండి: అమ్మా నేను చనిపోతున్నా.. నన్ను క్షమించు.. 

మరిన్ని వార్తలు