ఆకట్టుకుంటున్న ఓలా ఎలక్ట్రిక్ స్కూటర్ టీజర్

2 Jul, 2021 17:11 IST|Sakshi

దేశంలో త్వరలో లాంఛ్ చేయనున్న తన మొదటి ఎలక్ట్రిక్ స్కూటర్ కి సంబంధించిన టీజర్ ను ఓలా ఎలక్ట్రిక్ విడుదల చేసింది. ఈ వీడియోలో ఓలా సహ వ్యవస్థాపకుడు భవిష్ అగర్వాల్ కొత్త ఈ-స్కూటర్ ను బెంగళూరు రోడ్లపై నడిపారు. ఈ వీడియోలో త్వరలో రాబోయే స్కూటర్ గురించి కొన్ని కీలక వివరాలను కూడా కంపెనీ వెల్లడించింది. అగర్వాల్ టీజర్ వీడియోను షేర్ చేస్తూ ట్వీట్లో "ఈ అందమైన దాన్ని తిప్పడం కోసం తీసుకున్నాను! 0-60 కిలోమీటర్ల వేగాన్ని మీరు ఈ ట్వీట్ చదివే లోపు చేరుకుంటుంది" అని పోస్ట్ చేశాడు.

కొత్త ఈ-స్కూటర్ కొన్ని "సెగ్మెంట్-బెస్ట్" ఫీచర్లతో వస్తుందని వీడియోలో ప్రదర్శించారు. వీడియోలో ఉన్న స్కూటర్ బ్లాక్ కలర్ వేరియెంట్ అని గత నెలలో కంపెనీ చీఫ్ ధృవీకరించారు. ఓలా ఎలక్ట్రిక్ ఇతర రంగుల్లో కూడా స్కూటర్ లాంఛ్ చేస్తుంది. కొత్త ఓలా ఎలక్ట్రిక్ స్కూటర్ ఎర్గోనమిక్ సీటింగ్ తో వస్తుంది. స్కూటర్ "మెరుగైన కార్నరింగ్" సామర్థ్యంతో వస్తుందని కంపెనీ పేర్కొంది. దీనిలో "క్లాస్-లీడింగ్ యాక్సిలరేషన్"ను కలిగి ఉన్నట్లు తెలిపింది. ఈ స్కూటర్ "అతిపెద్ద-ఇన్-క్లాస్ బూట్ స్పేస్"తో వస్తుందని ఓలా పేర్కొంది.

చదవండి: పేటిఎమ్‌లో రూ.50 కోట్ల క్యాష్ బ్యాక్‌లు

మరిన్ని వార్తలు