దేశంలోనే అత్యంత విలువైన స్టార్ట‌ప్‌ కంపెనీగా బైజుస్

14 Jun, 2021 20:44 IST|Sakshi

దేశంలోని విద్యార్ధులకు కొత్త టెక్నాలజీని సహాయంతో ఆన్‌లైన్ ద్వారా విధ్య బోదన చేస్తూ ఒకేసారి మార్కెట్లోకి దూసుకోచింది బైజూస్‌ ఎడ్యుకేషన్ యాప్. దీనిలో ఎల్ కేజీ నుంచి ఐఏఎస్ వరకు శిక్షణ తీసుకుంటారు. ప్రస్తుతం క‌రోనా కార‌ణంగా విద్యా సంస్థ‌లు మూత‌ప‌డ‌డంతో ఆన్‌లైన్ ఎడ్యుకేష‌న్‌కు బాగా డిమాండ్ పెరగడంతో దేశ వ్యాప్తంగా ఇది ఫేమస్ అయ్యింది. ఈ యాప్ సేవలను 8 కోట్ల మందికి పైగా విద్యార్థులు వినియోగించుకుంటున్నారు. ఈ సంస్థ తాజాగా యుబిఎస్ గ్రూప్, జూమ్ వ్యవస్థాపకుడు ఎరిక్ యువాన్, బ్లాక్‌స్టోన్, అబుదాబి సావరిన్ ఫండ్ ఎడిక్యూ, ఫీనిక్స్ రైజింగ్-బెకన్ హోల్డింగ్స్ వంటి పెట్టుబడిదారుల నుంచి 2,500 కోట్ల రూపాయల(సుమారు 340 మిలియన్ డాలర్స్)ను సేకరించింది.

దీంతో బైజుస్ స్టార్ట‌ప్‌ కంపెనీ విలువ 16.5 బిలియన్ డాలర్లుకు పెరగింది. ఈ రౌండ్ ఫండింగ్‌ సేకరించిన తర్వాత బైజూస్ మార్కెట్ విలువ ఏకంగా రూ.1.20 ల‌క్ష‌ల కోట్లు దాటేసింది. ఇప్పటి వరకు అగ్రస్థానంలో ఉన్న స్టార్ట‌ప్‌ కంపెనీ పేటీఎంను బైజుస్ కంపెనీ అధిగమించింది. ప్రస్తుతం పేటీఎమ్ మార్కెట్ విలువ 16 బిలియన్ డాల‌ర్లగా ఉంది. 2020లో బైజు సుమారు 1 బిలియన్ నిదులను సేకరించింది. వెంచర్ ఇంటెలిజెన్స్ గణాంకాల ప్రకారం.. 2019లో 553 మిలియన్ డాలర్లతో పోలిస్తే భారతదేశ ఎడ్-టెక్ స్టార్టప్‌లు 2020లో 2.2 బిలియన్ డాలర్లు సేకరించాయి. గడిచిన ఆర్థిక సంవత్సరం (2020-21)లో కంపెనీ ఆదాయం 100 శాతం పెరిగి రూ.5,600 కోట్లకు చేరుకుంది.

చదవండి: ఎయిర్‌టెల్ 5జీ ఇంటర్నెట్ స్పీడ్ ఎంతో తెలుసా?

మరిన్ని వార్తలు