సుత్తితో మోది ప్రియురాలి హత్య

20 Oct, 2015 08:46 IST|Sakshi

తనతోనే సహజీవనం సాగించాలంటూ పట్టుబట్టిన మహిళను దారుణంగా హతమార్చిన ఘటన హుళిమావు పోలీస్ స్టేషన్ పరిధిలో వెలుగు  చూసింది. వివరాల్లోకి వెళితే... బన్నేరుఘట్ట రోడ్డు దొడ్డకమ్మనహళ్లికి చెందిన శషీదా(42), స్థానిక విబ్‌గ్యార్ పాఠశాలలో ఆయాగా పనిచేస్తోంది. ఈమె శానుబోగనహళ్లికి చెందిన వివాహితుడైన టెంపో డ్రైవర్ సిద్ధిక్‌పాషాతో వివాహేతర సంబంధం కొనసాగిస్తోంది.

భార్యను విడిచిపెట్టి తనతో సహజీవనం సాగించాలంటూ అతన్ని నిత్యం వేధిస్తుండేది. ఈ నేపథ్యంలోనే ఆదివారం రాత్రి శషీదా ఇంటికి వెళ్లిన సిద్ధిక్ పాషాతో మరోసారి ఈ విషయంలో ఆమె గొడవపడింది. సహనం కోల్పోయిన సిద్ధిక్‌పాషా సోమవారం వేకువజామున 4.30 గంటలకు నిద్రలో ఉన్న శషీదా తలపై సుత్తితో మోది, అనంతరం సిమెంట్ ఇటుక వేసి హత్య చేసి పారిపోయాడు. ఘటనపై  హుళిమావు పోలీసులు కేసు నమోదు చేసి, నిందితుడిని అదుపులోకి తీసుకున్నారు.
 

Read latest National News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు