జైలులోనూ ఎమ్మెల్యే కొడుకు అదే దూకుడు

23 Feb, 2018 09:24 IST|Sakshi
మహ్మద్‌ హ్యారిస్‌ నలపాడ్‌

సెల్‌లో మిత్రున్ని కొట్టిన మహ్మద్‌ హ్యారిస్‌

సాక్షి, బనశంకరి: యుబీ సిటీలో ఒక రెస్టారెంట్‌ వ్యాపారవేత్త కొడుకు విద్వత్‌పై దాడికి పాల్పడిన కేసులో శాంతినగర కాంగ్రెస్‌ ఎమ్మెల్యే హ్యారిస్‌ కొడుకు మహ్మద్‌ హ్యారిస్‌ నలపాడ్‌ పరప్పన అగ్రహార సెంట్రల్‌ జైలులో రిమాండ్‌లో ఉన్నాడు. ఎమ్మెల్యే కొడుకు అక్కడ కూడా తన దుందుడుకు తనం ప్రదర్శించాడు. జైలులో స్నేహితుడిపై దాడికి దిగాడు. 

బుధవారం అర్ధరాత్రి 1.30 సమయంలో ఐదవ నిందితునిగా ఉన్న తన మిత్రుడు అబ్రాస్‌.. ‘నేను జైలుకు రావడానికి మీరే కారణం’ అని మహ్మద్‌ తిట్టాడు. దీంతో ఇద్దరి మధ్య గొడవ మొదలైంది. అబ్రాస్‌ పై మహ్మద్‌ కోపం పట్టలేక దాడికి దిగాడు. సెల్‌లో ఇద్దరూ ముష్టియుద్ధానికి దిగిన విషయం తెలుసుకుని జైలు అధికారులు ఇద్దరిని విడిపించారు. అబ్రాస్‌ను మరో సెల్‌కు తరలించారు. 

విలపిస్తూనే భోజనం 
విద్వత్‌పై దాడి కేసులో నగరంలోని 8 వ ఏసీఎంఎం కోర్టు నిందితులకు జ్యుడీషియల్‌ కస్టడీ విధించడంతో బుధవారం సాయంత్రం మహ్మద్, మరో ఐదుగురిని పరప్పన జైలుకు తరలించడం తెలిసిందే. జైల్లో పెట్టిన అన్నం సాంబారును మహ్మద్‌ ఏడుస్తూనే తిన్నట్లు తెలిసింది. స్నేహితునితో గొడవతో అతని సెల్‌ వద్ద భద్రత పెంచారు. మిత్రులను వేర్వేరు గదులకు తరలించారు.  
మహ్మద్‌ హ్యారిస్‌పై గతంలో కూడా ఇటువంటి దుందుడుకు ఘటనలకు పాల్పడ్డారనే ఆరోపణలు చాలానే ఉన్నాయి.

  • 2016వ సంవత్సరం జూన్‌లో యూబీ సిటీలోని పార్కింగ్‌లో కారు తీయడంలో ఆలస్యం చేసినందుకు మహ్మద్‌ ఒక యువకునిపై దాడికి పాల్పడగా అతడు పోలీసులకు ఫిర్యాదు చేశాడు, తండ్రి, ఎమ్మెల్యే హ్యారిస్‌ రాజకీయ పలుకుబడితో ఘటనను పెద్దది కాకుండా చేశారని సమాచారం. 
  • అదే సంవత్సరం ఆగస్ట్‌లో శాంతినగర లోని ఓ పబ్‌లో, కొద్దిరోజుల అనంతరం బౌరింగ్‌ క్లబ్‌లో బౌన్సర్లపై దాడి చేసి వీరంగం సృష్టించినట్లు ఆరోపణలు ఉన్నాయి.
  • దయానంద కాలేజీ విద్యార్థి సౌరవ్‌పై తన తమ్ముడు ఒ మర్‌తో కలసి దాడి చేయడమే కాకుండా రూ.10లక్షలు ఇవ్వాలంటూ డిమాండ్‌ చేయగా, ఒక కార్పోరేట్‌ రంగంలోకి దిగి మహ్మద్‌ను చీవాట్లు పెట్టినట్లు సమాచారం.
  • రెండేళ్ల క్రితం నగరానికి చెందిన ఓ అంతర్జాతీయ స్థాయిలో పేరుగాంచిన ఫ్యాషన్‌ డిజైనర్‌ కుమార్తెను వేధించినట్లు ఆరోపణలు వచ్చాయి. యువతి పోలీసులకు ఫిర్యాదు చేయడంతో వెనక్కు తగ్గాడు. 

ఇతర రాష్ట్రాల ప్రజాప్రతినిధుల పుత్రరత్నాలతో పార్టీలు...
పొరుగు రాష్ట్రాలైన తమిళనాడు, కేరళ, ఆంధ్రప్రదేశ్‌ ప్రజాప్రతినిధుల çకుమారులతో కూడా మహ్మద్‌కు మంచి సంబంధాలున్నాయని సమాచారం. ప్రతీనెలా వీరంతా యూబీ సిటీలో పార్టీలు విందు వినోదాల్లో మునిగి తేలుతుంటారు. 
 

Read latest Crime News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు